🌲ప్రధానాంశాలు:
స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ముందే డబ్బు తీసుకోవాలంటే చార్జీలు చెల్లించాల్సిందే
1 శాతం వరకు పెనాల్టీ పడుతుంది
అలాగే తక్కువ వడ్డీ లభిస్తుంది
ఎఫ్‌డీ చేసే ముందే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి
ఎఫ్‌డీలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయల్, విత్‌ఔట్ ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయల్ ఇవేవి ఇవి.
ప్రిమెచ్యూర్ విత్‌డ్రా ఆప్షన్ ఉన్న ఎఫ్‌డీలను ఎంచుకుంటే.. మెచ్యూరిటీ కన్నా ముందుగానే డిపాజిట్లను వెనక్కు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగానే డబ్బులు వెనక్కు తీసుకుంటే కొంత చార్జీలు చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటివి ఎఫ్‌డీలకు సంబంధించి వాటివాటి రూల్స్‌ను అవి ఫాలో అవుతూ ఉంటాయి.
స్టేట్ బ్యాంక్ ఎఫ్‌డీల ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్స్‌పై 0.50 శాతం పెనాల్టీని వసూలు చేస్తోంది. అంటే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి డబ్బులను ముందే తీసుకోవాలంటే చార్జీలు చెల్లించాల్సిందే. రూ.5 లక్షల వరకు విత్‌డ్రాయెల్స్‌కు 0.5 శాతం, ఆపైన విత్‌డ్రాయెల్స్‌పై 1 శాతం పెనాల్టీ కట్టాలి. అంతేకాకుండా ఎఫ్‌డీల నుంచి డబ్బు ముందుగానే తీసుకుంటే 0.50 లేదా 1 శాతం తక్కువ వడ్డీ లభిస్తుంది. 7 రోజలులోపు డిపాజిట్లకు ఎలాంటి వడ్డీ రాదు. అందుకే బ్యాంకులో డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన తర్వాత వాటి గురించి మరిచిపోవాలి. మళ్లీ మెచ్యూరిటీ సమయంలోనే డబ్బులను వెనక్కు తీసుకోవాలి. అందుకే డిపాజిట్ చేసేముందు భవిష్యత్ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితిలో ఎఫ్‌డీలను అందిస్తోంది. బ్యాంక్ ఇటీవలనే ఎఫ్‌డీ రేట్లను తగ్గించింది. రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును ఇటీవల 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఇందుకు కారణం. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 7 శాతం మధ్యలో వడ్డీ రేటు లభిస్తోంది.
No comments:
Post a Comment