చాలామంది ఎన్నారైలు విదేశాల్లో కష్టపడి పనిచేసి.. ఆ డబ్బును భారత్‌లోని తమ వారికి చేరవేసేందుకు నానా ఇబ్బందులూ పడుతుంటారు. ఎన్నారైలు ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ విషయంలోనే. భారత్‌లోని ఎన్నారై ఎకౌంట్ ద్వారా కాకుండా పర్సనల్ చెక్ ద్వారా డబ్బు పంపేవారిలో చాలామంది ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటారు. ఇలాంటి కేసుల్లో చాలా భారత బ్యాంకులు కష్టమర్ సహనాన్ని పరీక్షిస్తాయి. అయినా న్యాయం జరిగిన కేసులు కొన్నే. ఈ నేపథ్యంలో డబ్బును భారత్‌కు పంపే విషయంలో ఎన్నారైలు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. 1)ఆర్భాటమైన ప్రకటనల కోసం విపరీతంగా ధనాన్ని వెచ్చించే కొన్ని భారత బ్యాంకులు.. కష్టమర్ సర్వీస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే మనీ ట్రాన్స్‌ఫర్ విషయంలో రెప్యుటెడ్ బ్యాంకులనే ఆశ్రయించాలి. 2)నగదు బదిలీని పర్సనల్ చెక్ ద్వారా కాకుండా భారత్‌లోని ఎన్నారై అకౌంట్ ద్వారా చేయడం ఉత్తమం. 3)భారత్‌లోని ఎన్నారై అకౌంట్ ద్వారా చెక్ పంపినపుడు.. ఆ చెక్‌పై ‘అకౌంట్ పేయబుల్ ఓన్లీ’ అన్ని ఉన్న దగ్గర మార్క్ చేయడం మర్చిపోకూడదు. అలాగే ఆ చెక్ వెనకాల అకౌంట్ పేయబుల్ ఓన్లీ అని రాయాలి. 4)అలా రాస్తే అ చెక్‌ను నేరుగా క్యాష్ చేసుకోవడం కుదరదు. ముందుగా డబ్బు తీసుకునే వ్యక్తి ఆ చెక్‌ను తన అకౌంట్‌లో జమ చేసుకోవాలి. ఆలా చేయడం వల్ల ఆ చెక్‌ను అనుక్షణం ట్రేస్ చేయడానికి వీలు కుదురుతుంది. 5)అకౌంట్ పేయబుల్ ఓన్లీ అని రాయకపోతే ఆ చెక్‌ను ఎవరైనా క్యాష్ చేసుకోవచ్చు. 6)అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ ట్రాన్స్‌ఫర్ ఎజెంట్ల ద్వారా మాత్రం డబ్బు పంపకూడదు. 7)ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బ్యాంకింగ్ విషయాల్లో పొరపాట్లు జరుగుతాయి. ఆ సమయంలో సహనంగా వ్యవహరిస్తే మంచిది. వారి పొరపాట్లను ఎండగడుతూ లెటర్లు రాయడం, ఫోన్లు చేయడం వంటివి చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. 8)సాధ్యమైనంత వరకు సహనంగా మాట్లాడాలి. అప్పటికీ పరిష్కారం కాకపోతే మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ చేయాలి.
No comments:
Post a Comment