Friday, October 25, 2019
సిప్ లలో పెట్టుబడులు
🎄 గత కొన్నేళ్లుగా సిప్ లలో పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 🎄 2018-19 సంవత్సరంలో రూ.92,700 కోట్లు, 2017-18 సంవత్సరంలో రూ. 67,000 కోట్లు, 2016-17 సంవత్సరంలో రూ. 43,900 కోట్ల పెట్టుబడులు సిప్ ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి వచ్చాయి.🎄 మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో 44 సంస్థలున్నాయి. ప్రస్తుతం సిప్ ఖాతాల సంఖ్య 2.81 కోట్ల వరకు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 🎄2019-20 ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెల దాదాపు 9.39 లక్షల సిప్ ఖాతాలు జతయ్యాయి. వీటిలో సగటు పెట్టుబడి రూ. 2900 ఉంది. 🎄ఏక మొత్తంగా కాకుండా తక్కువ మొత్తంలో వారం, నెల లేదా మూడు నెలకు ఒకసారి పెట్టుబడులు పెట్టే సౌలభ్యం ఉండటం వల్ల ఇన్వెస్టర్లు సిప్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 🎄సిప్ పెట్టుబడి అనేది రికరింగ్ డిపాజిట్ లాంటిదే. నచ్చినంత లేదా స్థిరంగా దీని ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment