ఆధార్ వివరాలు ఇచ్చిన వారికి వెంటనే ఆన్‌లైన్ ద్వారా పాన్ నెంబర్ కేటాయించే సదుపాయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్నటి వరకు 6,77,680 పాన్ నెంబర్లు ఆన్ లైన్ ద్వారా కేటాయించారు. ఆధార్ నెంబర్, ఆధార్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ రెండూ ఉన్న వారికి ఆన్ లైన్ ద్వారా పాన్ కేటాయింపు వర్తిస్తుందని సీబీడీటీ పేర్కొంది. ఏం టైంకు తెరుచుకుంటాయ్: బ్యాంకు పనివేళల్లో మార్పులు, SBI ఏం చెప్పిందంటే? ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఉచితం ఆధార్ కార్డు ద్వారా పాన్ నెంబర్ లేదా పాన్ కార్డు తీసుకోవాలనుకునే వారు ఐటీ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి అడిగిన వివరాలు అందించాలి. ఆ తర్వాత 15 నిమిషాల్లో పాన్ నెంబర్ వస్తుంది. పన్ను చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) సేవలు పూర్తి ఉచితంగా లభిస్తాయని సీబీడీటీ తెలిపింది. పాన్ కేటాయింపు మరింత సులభతరం చేసేందుకు పాన్ కార్డు కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లోనే దీనిని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ప్రతిసారి అన్ని వివరాలతో దరఖాస్తును నింపాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్ వివరాలతో ఆన్‌లైన్ ద్వారా వెంటనే పాన్ నెంబర్ కేటాయించే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. చెల్లుబాటయ్యే ఆధార్ నంబర్‌ను, దీంతో అనుసంధానమైన ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది.
పాన్ కార్డు ఇలా పొందవచ్చు.. పాన్ కార్డు వెంటనే పొందేందుకు ఇలా చేయండి.
- ఆదాయపు పన్ను శా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- అక్కడ మీ ఆధార్ వివరాలు పొందుపరచాలి.
- ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఇది పూర్తయిన పది పదిహేను నిమిషాల తర్వాత 15 డిజిట్ అక్నాలెజ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment