Top Business News- News18.com

Thursday, June 4, 2020

కొత్త ఐటీ ఫామ్స్: కరెంట్ బిల్లు రూ.లక్ష దాటినా,బ్యాంకులో రూ.కోటి ఉన్నా ఐటీ రిటర్న్స్ తప్పనిసరి

Updated: జూన్ 5,2020
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) దాఖలుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త ఫారాలను నోటిఫై చేసింది. బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు లేదా భారీగా కరెంట్ బిల్లు కడుతూ మాకేం ఆదాయం లేదు, రిటర్న్స్ ఫైల్ చేయమని చెబితే ఇక కుదరదు. ఇలాంటి వారు కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 2020 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2020-21 అసెస్‌మెంట్ ఇయర్ నుండే ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. 
ఆదాయపుపన్ను రిటర్న్స్ గడువు తేదీ మూడు నెలలు పొడిగింపు:
 కరెంట్ బిల్లు లక్ష దాటినా, ఖాతాలో కోటి దాటినా.. సహజ్ (ఐటీఆర్-1), ఐటీఆర్-2, ఐటీఆర్-3, సుగమ్ (ఐటీఆర్-4), ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7, ఫాం ఐటీఆర్-v(వెరిఫికేషన్) CBDT  నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన వివరాలు వీటిలో తెలియజేయాల్సి ఉంటుందని CBDT స్పష్టం చేసింది. కరెంట్ ఖాతాలో డిపాజిట్లు రూ.1 కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసి ఉంటే, విద్యుత్ బిల్లు రూ.1 లక్,కు మించితే ఐటీ రిటర్న్స్‌లో తెలియజేయాలి. 
కొత్త ఐటీ ఫామ్ ప్రకారం.. 
- ఈ కొత్త ఐటీ ఫామ్ ప్రకారం పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాల వివరాలను ప్రత్యేకంగా సమర్పించాలి.
 - ఏదైనా బ్యాంకులో కరెంట్ ఖాతాలో డిపాజిట్లు రూ.1 కోటి దాటితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి.
 - వార్షిక పవర్ బిల్లు రూ.1 లక్ష లేదా అంతకుమించి దాటితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 
- ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేస్తే వెల్లడించాలి. 
- పన్ను చెల్లింపుదారులు కొత్త ఐటీఆర్‌లో అధిక వ్యయాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ వివరాలు తెలియజేయాలి.  ఆదాయపుపన్నుదారుల ప్రయోజనం కోసం.. 
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పొడిగించిన పలు ప్రయోజనాలను ఆదాయపుపన్నుదారులు పొందేందుకు వీలుగా ఐటీఆర్ పత్రాలను సవరించింది. దీని ప్రకారం 2020 జూన్ వరకు పన్ను మినహాయింపు పొందే పెట్టుబడులు లేదా చందాలను కూడా ప్రత్యేకంగా చూపించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961కి ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ ఆర్డినెన్స్ 2020 ద్వారా కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. గడువును పొడిగించింది. దీని ప్రకారం సెక్షన్ 80సీ, 80డీ, 80జీ కింద చేసే పెట్టుబడులు లేదా చెల్లింపులు లేదా చందాలను మదింపుదారులు రిటర్న్స్‌లో చూపించి ప్రయోజనం పొందవచ్చు. సవరించిన ఫామ్స్ కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వివిధ కాలపరిమితిల పొడిగింపు ప్రయోజనాలను కల్పించింది. వీటిని పొందేందుకు ఐటీ రిటర్న్స్ ఫామ్‌లను సీబీడీటీ తాజాగా సవరించింది. ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో ఐటీఆర్ ఫామ్‌లను ఐటీ శాఖ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది జనవరిలోనే ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫామ్‌లను విడుదల చేసింది. కరోనా సంక్షోభం కారణంగా ఇప్పుడు అన్ని ఐటీ ఫామ్‌లను సవరించింది. 
 నవంబర్ 30 వరకు గడువు:  ఈ మార్పులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌ను సమర్పించేందుకు నవంబర్ 30వ తేదీ వరకు గడువును పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. ఐటీఆర్-4లో ఆధార్ నెంబర్‌ను సమర్పిస్తే పాన్ నెంబర్ తప్పనిసరి కాదని సీబీడీటీ తెలిపింది. ఐటీఆర్-1లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విభజించడంతో పాటు కొత్త కాలమ్ NAను జత చేర్చింది. 
 ఏ ఐటీఆర్ ఎవరి కోసం? 
ఐటీఆర్-1 (సహజ్) - వార్షిక ఆదాయం రూ.50 లక్షలు మించని సాధారణ పౌరులు. 
ఐటీఆర్-2 : వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు (వ్యాపార, వృత్తిరీత్యా రాబడిలేనివారు) 
ఐటీఆర్-3: వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు 
ఐటీఆర్-4 సుగమ్: వృత్తి లేదా వ్యాపారం ద్వారా రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్, సంస్థలు 
ఐటీఆర్-5: పరిమిత భాగస్వామ్య సంస్థలు (ఎల్ఎల్‌పీ), అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏఓపీ)
 ఐటీఆర్-6: సెక్షన్ 11 కింద మినహాయింపు కోరని సంస్థలు 
ఐటీఆర్-7: ట్రస్ట్స్, ధార్మిక సంస్థల ఆస్తులపై ఆదాయం పొందే వ్యక్తులు ఐటీఆర్-వీ: వెరిఫికేషన్ కోసం

ఆధార్ కార్డు ఉంటే 15 నిమిషాల్లో ఈ-పాన్ నెంబర్..


 ఆధార్ వివరాలు ఇచ్చిన వారికి వెంటనే ఆన్‌లైన్ ద్వారా పాన్ నెంబర్ కేటాయించే సదుపాయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్నటి వరకు 6,77,680 పాన్ నెంబర్లు ఆన్ లైన్ ద్వారా కేటాయించారు. ఆధార్ నెంబర్, ఆధార్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ రెండూ ఉన్న వారికి ఆన్ లైన్ ద్వారా పాన్ కేటాయింపు వర్తిస్తుందని సీబీడీటీ పేర్కొంది. ఏం టైంకు తెరుచుకుంటాయ్: బ్యాంకు పనివేళల్లో మార్పులు, SBI ఏం చెప్పిందంటే? ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఉచితం ఆధార్ కార్డు ద్వారా పాన్ నెంబర్ లేదా పాన్ కార్డు తీసుకోవాలనుకునే వారు ఐటీ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి అడిగిన వివరాలు అందించాలి. ఆ తర్వాత 15 నిమిషాల్లో పాన్ నెంబర్ వస్తుంది. పన్ను చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) సేవలు పూర్తి ఉచితంగా లభిస్తాయని సీబీడీటీ తెలిపింది. పాన్ కేటాయింపు మరింత సులభతరం చేసేందుకు పాన్ కార్డు కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లోనే దీనిని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ప్రతిసారి అన్ని వివరాలతో దరఖాస్తును నింపాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్ వివరాలతో ఆన్‌లైన్ ద్వారా వెంటనే పాన్‌ నెంబర్ కేటాయించే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. చెల్లుబాటయ్యే ఆధార్ నంబర్‌ను, దీంతో అనుసంధానమైన ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. 
పాన్ కార్డు ఇలా పొందవచ్చు.. పాన్ కార్డు వెంటనే పొందేందుకు ఇలా చేయండి.
 - ఆదాయపు పన్ను శా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
 - అక్కడ మీ ఆధార్ వివరాలు పొందుపరచాలి. 
- ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
 - ఇది పూర్తయిన పది పదిహేను నిమిషాల తర్వాత 15 డిజిట్ అక్నాలెజ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. 
- ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

 మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీముల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది. 
మ్యూచువల్ ఫండ్స్‌ గురించి అర్ధం అయ్యేందుకు ఒక ఉదాహరణ:  సూపర్ రిటర్న్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సూపర్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ అనే పధకాన్ని ప్రవేశపెట్టింది అనుకుందాం. ఈ పధకం క్రింద సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ స్కీమ్ ఉంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఈ స్కీమ్ క్రింద వివిధ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 100కోట్లు సేకరించింది. ఈ స్కీమ్ గనుక ఈక్విటీ స్కీమ్ ఐతే షేర్లలో ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అదే రుణ స్కీమ్ ఐతే ఈ డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లలలో మదుపు చేస్తారు. ఈ ఫండ్ మొదట్లో ఒక యూనిట్‌ను రూ. 10కి ఇచ్చిందని అనుకుందాం. ఒక్కో యూనిట్‌కు గాను రూ. 10 కాబట్టి మొత్తంగా రూ. 10,000 చెల్లించి 1000 యూనిట్లను కొనుగోలు చేశారు. ఒక్క సంవత్సరం తర్వాత సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు చేరింది. ఈ సమయంలో మీరు మీ యూనిట్స్‌ను తిరిగి మ్యూచవల్ ఫండ్స్‌కు అమ్మినట్లైతే, మీరు కొనుగోలు చేసిన 1000 యూనిట్లకు గాను మీరు రూ. 12,000 పొందుతారు. 
కొత్త యూనిట్లను(న్యూ ఫండ్ ) కొనుగోలు చేయాలనుకునేవారికి ఉపయోగం ఏంటీ? 
కొత్తగా యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుడు రూ. 12 చెల్లించి యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు మించి పెరిగితే ఆ సమయంలో మీరు మీ యూనిట్లను అమ్ముకోవచ్చు. దీంతో మీరు ఎక్కువ డబ్బును పొందగలుగుతారు.
మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి. 
1.ఈక్విటీ ఫండ్స్: ఈక్వీటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బుని సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్. 
2 డెట్ ఫండ్స్:  డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ డెట్, బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీమ్‌లలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. 
3.బ్యాలె‌న్స్‌డ్ ఫండ్స్:  మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీల్లో పెట్టుబడులు చేయడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంతో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది. ఐదేళ్ళ కాలానికైతే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ అనువైనవి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధికమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే. 
4.మనీ మార్కెట్:  మ్యూచవల్ ఫండ్స్ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌కు మరో పేరు లిక్విడ్ ఫండ్స్. డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ అంటారు. ఈ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబుడులు పెడతారు.
 5.గిల్ట్ ఫండ్స్:  గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఫండ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో పెద్ద మొత్తంలో డబ్బుని మదుపు చేస్తారు. ఈ డబ్బుని బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.